తమిళ అగ్ర హీరో ఇళయ తలపతి విజయ్(విజయ్) స్థాపించిన పొలిటికల్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ మొదటి మీటింగ్ ఇటీవల విల్లుపురంలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులోనే విజయ్ తమ పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు.సుమారు ఆరు లక్షల మంది వరకు హాజరుయ్యారనే వార్తల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల్లో వణుకు కూడా పుడుతుంది.
ఈ పార్టీ మీటింగ్ లో విజయ్ తమ పార్టీ విధి విధానాలను సూటిగా చెప్పాడు.అదే టైంలో సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేసే వాళ్ళకి తమిళ, తెలుగు సినిమాలో అగ్ర హీరోలుగా చెలామణి అయ్యి ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన ఎంజీఆర్(mgr)ఎన్టీఆర్(ఎన్టీఆర్)లని మరోసారి గుర్తు చేసాడు.తమతో పాటు కలిసి వచ్చే పొత్తులతో పొత్తు. కుంటామని కూడా వెల్లడి చేసి తమిళనాట సరికొత్త రాజకీయాలకి తెర లేపుతానని కూడా చెప్పినట్టు.దీంతో ఆంధ్రప్రదేశ్‌ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)ని విజయ్ కలుస్తాడనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లే విజయాన్ని సాధించాడు.ఆ ప్రాసెస్ లో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవడంతో పాటుగా పొత్తుల పరంగా ముందుకు వెళ్ళాడు.దీంతో పవన్ కళ్యాణ్ ని కలిసి రాజకీయపరమైన సలహాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చాలా కాలం నుంచి పవన్, విజయ్ ల మధ్య మంచి పరిచయం ఉంది. విజయ్ నటించిన కొన్ని సినిమాలని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ని అందుకున్నాడు. విజయ్ పొలిటికల్ పార్టీ సక్సెస్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేసాడు.