తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి నటించి అశేష అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సుహాసిని(సుహాసిని)ముఖ్యంగా చిరంజీవి(చిరంజీవి) బాలకృష(బాలకృష్ణ)తో కలిసి చేసిన సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.లేడీ ఓరియంటెడ్ కి సంబంధించిన సినిమాల్లో కూడా నటించి తనకి తానే సాటి అనిపించుకుంది.
రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్లని చూపించే తీరు మారింది.ముఖ్యంగా 2010 నుంచి విపరీతమైన మార్పులు వచ్చాయి.భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు.హీరోలకి స్ట్రాంగ్ రోల్స్ రాస్తు హీరోయిన్లకి మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాక్షసుడు, మరణమృదంగం, మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ఛాలెంజ్, ఆఖరిపోరాటం, సిరివెన్నెల, స్వాతి, శ్రావణ సంధ్య ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు కలుపుకొని సుమారు వంద సినిమాలకి పైనే చేసింది.తన సెకండ్ హాస్టల్ లో కూడా మంచి పాత్రలతో ప్రేక్షకుల అలరిస్తూ సుహాసిని ప్రముఖ హీరో కమల్ సుహాసిని (kamal haasan)అన్నయ్య కూతురన్న విషయం తెలిసిందే.