Home ఆంధ్రప్రదేశ్ వైసిపి వర్సెస్ వైయస్ షర్మిల.. ఏపీలో హీటెక్కిన అన్నా, చెల్లెళ్ళ వివాదం – Sneha News

వైసిపి వర్సెస్ వైయస్ షర్మిల.. ఏపీలో హీటెక్కిన అన్నా, చెల్లెళ్ళ వివాదం – Sneha News

by Sneha News
0 comments
వైసిపి వర్సెస్ వైయస్ షర్మిల.. ఏపీలో హీటెక్కిన అన్నా, చెల్లెళ్ళ వివాదం


ఏపీలో ఆస్తి వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ జగన్ వర్సెస్ షర్మిల మాదిరిగానే ప్రారంభమై.. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ వైయస్ షర్మిల అన్నట్టుగా వివాదం మారింది. ఆస్తి పంపకాల విషయంలో ఇరువురి మధ్య వచ్చిన గొడవల్లో వైయస్ షర్మిల బహిరంగంగా జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్ జగన్ మాత్రం ఎక్కడ బయటకు వచ్చి ఆమె గురించి గానీ, ఆస్తి వివాదం గురించి గానీ మాట్లాడడం లేదు. కానీ, శ్రేణులు మాత్రం వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైసీపీని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టిలో కేసు వేసిన తర్వాత తీవ్ర స్థాయిలో మీడియాతో మాట్లాడడంతో పాటు లేఖ రాసిన షర్మిల గట్టిగానే జగన్ ను ఉదహరించారు. షర్మిల చేసిన విమర్శల తర్వాత చాలామంది జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అసలు వాస్తవాలు ఏంటో వివరించారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా మిగిలిన వాళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ షర్మిల లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షర్మిల మీడియా సమావేశం తర్వాత మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి ఆమె వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. మోహన్ రెడ్డి ఆస్తితో షర్మిలకు సంబంధం లేదంటూ జగన్. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన ఆస్తులు పంపకాలు ఎప్పుడో తెలుసా.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలను చేశారు. చంద్రబాబుతో కలిసి దుష్ట రాజకీయాలను షర్మిల పన్నడానికి, మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం కానీయకూడదు అన్న లక్ష్యంతోనే ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబునాయుడు గడుపుతున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరి వల్ల అయితే రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు వారితోనే కలిసి షర్మిల చేస్తున్న రాజకీయాలను చూసి వైఎస్ ఆత్మ క్షోభిస్తుందంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఉన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నష్టాల్లో ఉన్నప్పుడు షేర్ తీసుకొని షర్మిల ఇప్పుడు మాత్రం ఆస్తిలో వాటాలు అడుగుతుండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డైనమిక్ లీడర్ వెంట ఎన్ని కుట్రలు, కుట్రలు పన్నినా ప్రజలు ఉంటారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ వారసరాలుగా వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకునేందుకు తెలంగాణలో, ఏపీలో చేసిన షర్మిల ప్రయత్నాలు విఫలమయ్యాయి. తెలంగాణలో ఆమో కమెడియన్ గా మిగిలిపోయారని, ఏపీలో విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా వైసీపీకి చెందిన అభిమానులు కార్యకర్తలు, వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో వైయస్ షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది.

జంట నగరాల ప్రజలకు పోలీసుల హెచ్చరిక.. నేటి నుంచి 144 సెక్షన్ అమలు
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్‌పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech