44
వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు న్యాయస్థానం స్పష్టం చేసింది.
నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన టైంలో.. వారు విడాకులు తీసుకుంటారంటూ జ్యోతిష్యం పేరుతో వారి వ్యక్తిగత జీవితం గురించి వేణు స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణు పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయగా.. నోటీసులు ఇచ్చిన తమ ముందు హాజరు కావాలని గతంలో వేణుని కోరింది. అయితే కమీషన్ కు ఆ అధికారం లేదంటూ వేణు స్టే తెచ్చుకున్నాడు. నేడు ఆ స్టేను ఎత్తివేసిన హైకోర్టు, కమిషన్‌కు పూర్తి అధికారాలున్నాయని. వారం రోజుల్లో వేణుపై తదుపరి చర్యలు తీసుకోమని కమీషన్ సిద్ధం చేసింది.