జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. వార్తల్లోకెక్కింది. మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల అలియాస్ రాజేంద్ర ప్రసాద్ పాకాలకు చెందిన ఈ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించడం ఇందుకు కారణం.ఈ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తితో పాటు మరొకరు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు.
జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రి నార్సింగి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, ఎక్సైజ్ అధికారులు, స్నిఫర్ డాగ్స్ సిబ్బంది జైంట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవ్ పార్టీలో 35 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఫామ్ హౌస్ నుంచి భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆసుపత్రికి తదుపరి వైద్య పరీక్ష. అతనిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టంలోని సెక్షన్ 27 కింద కేసు నమోదు చేయబడింది.
ఎలాంటి అనుమతులు, ఎక్సైజ్ లైసెన్స్ లేదా ఈ రేవ్ పార్టీలో విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయించినందువల్ల ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రాజ్ పాకాలపై సెక్షన్ 34 ఏ, 34 (1), 9 కింద కేసులు నమోదు చేశారు. అనధికారంగా మద్యం విక్రయించడం, మదక ద్రవ్యాల వినియోగం కింద కేసులు.జన్వాడ ఫామ్ హౌస్‌పై గతంలో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. బఫర్ జోన్ంటూ దీన్ని నిర్మించారని, హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలొచ్చాయి. ఇది కేటీఆర్‌దేనంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఆయన బావమరిదిదని తేలడం ప్రాధాన్యతను సంతరించుకుంది.