47
ముద్ర, తెలంగాణ బ్యూరో : మేడారం సమ్మక్క, సారాలమ్మల చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు ఈ చిన్న జాతర జరగనుంది. మేడారం మహా జాతర జరిగిన మరుసటి ఏడాది చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం పూజారు సమావేశమై చిన్న జాతర తేదీలను ప్రకటించారు.