Home తాజా వార్తలు రోడ్డెక్కిన ఖాకీ.. ! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

రోడ్డెక్కిన ఖాకీ.. ! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
రోడ్డెక్కిన ఖాకీ.. ! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రంగారెడ్డి, సిరిసిల్ల, నల్లగొండ బెటాలియన్లలో పోలీసుల ఆందోళన
  • రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం అమలు కోసం డిమాండ్
  • ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని బెటాలియన్‌ కానిస్టేబుళ్లు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ పలు పోలీస్ బెటాలియన్లలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నాగార్జున సాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న సాధారణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బెటాలియన్ పోలీసు కుటుంబాలపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీసీపీ తీరుపై మండిపడ్డ నిరసనకారులు సాగర్ రహదారిపై రాకపోకలు స్తంభింపజేసారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ధర్నాకు దిగారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు విధులు వేసి మా సంసారాన్ని కుటుంబానికి దూరంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేస్తున్నారు.. అలాగే, పెద్ద అధికారుల ఇళ్లలో పాచి పనులు, బొల్లు తోమడం, ఇళ్లు ఊడవడం, పిల్లలను స్కూల్ కి పంపడం, మందు తాగి పబ్బుల్లో పడిపోతే తీసుకురావడం లాంటి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు. మాపై ఆంధ్ర అధికారుల పెత్తనం పేరు ధ్వజమెత్తారు.. రోడ్డెక్కిన కానిస్టేబుల్స్ భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నల్లగొండ నిర్మాణం అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి నిరసన తెలిపారు. నల్లగొండ రూరల్ ఎస్సై సైదాబాబును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కానిస్టేబుళ్లు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేసిన కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులను పోలీసులు బారిగేట్లు వేసి అడ్డుకున్నారు.

ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు : డీజీపీ

రాష్ట్రంలో బెటాలియన్‌ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై డీజీపీ జితేందర్‌ తీవ్రంగా స్పందించారు. ఆందోళనల వెనుక రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల సెలవులపై పాత పద్ధతినే అమలు చేయాలని ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు.

బెటాలియన్ కుటుంబ సభ్యుల డిమాండ్స్

  • మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలి.
  • ఏక్ పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ పాటు కల్పించాలి.
  • బ్రిటిష్ కాలం నాటి విధానాలను ప్రస్తుత కాలానికి మార్చాలి.
  • ఓకే చోట ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబాలకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
  • బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరీ నశించాలి.
  • ఇండ్లలో బానిస బతుకుల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్.
  • హోంశాఖ మీ చేతుల్లోనే ఉంది.. తమ బ్రతుకులు కూడా సీఎం చేతుల్లోనే ఉన్నాయ్ అంటూ నినాదాలు ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech