Home సినిమా నా జీవితంలో భయం అనేది ఎంత ఖరీదైనదో వాళ్ళకి బాగా తెలుసు – Sneha News

నా జీవితంలో భయం అనేది ఎంత ఖరీదైనదో వాళ్ళకి బాగా తెలుసు – Sneha News

by Sneha News
0 comments
నా జీవితంలో భయం అనేది ఎంత ఖరీదైనదో వాళ్ళకి బాగా తెలుసు


నందమూరి బాలకృష్ణ(బాలకృష్ణ)హోస్ట్‌గా వ్యవరిస్తున్న అన్‌స్టాపబుల్ షో(అన్‌స్టాపబుల్)ఎంతగా విజయాన్ని సాధించిందో అందరకీ తెలిసిన, ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలబడింది.రీసెంట్ గా 4వ సీజన్ స్టార్ట్ అవ్వగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(నారా చంద్రబాబు నాయుడు)మొదటి గెస్ట్ గా వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తో బాలకృష్ణ(balakrishna)మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)తిరుపతి లడ్డు(tirupati laddu) విషయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా సనాతన ధర్మం కోసం దీక్ష జరిగింది కదా,దీనిపై మీ ఉద్దేశ్యం ఏంటని అడిగాడు. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ ఎవరి నమ్మకాలూ వారికి ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా అందరి నమ్మకాలూ కాపాడే బాధ్యత నాపై ఉంటుంది.ఎక్కడ ఎలాంటి అపచారం జరగకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, పరిపాలన సాగించడం నా బాధ్యత.

ఎన్నికల ముందు నేను జైలులో ఉన్నప్పుడు కలిసాడు.రెండు నిమిషాలు ఇద్దరం మాట్లాడుకున్నాం. ధైర్యంగానే ఉన్నారా అని అడిగితే నా జీవితంలో ధైర్యం ఉండదు, భయపడను అని చెప్పా. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు చూశాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా కలిసి పోటీ చేద్దామని అన్నాను.ఆయన కూడా ఆలోచించి ఓకే చెప్పాడు.బీజేపీ(bjp)కి కూడా నచ్చజెప్పి కూటమికి తీసుకొస్తానని చెప్పడంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించామని చెప్పారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech