41
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వద్ద గవర్నర్ కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ… పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట గవర్నర్ ప్రత్యేక పూజలు చేయగా…. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం గవర్నర్ కు సీతారాముల చిత్రపటాన్ని అందజేసి… శాలువాతో సత్కరించిన అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.