Home సినిమా నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ – Sneha News

నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ – Sneha News

by Sneha News
0 comments
నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ


తారాగణం: శివకుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న,శృతి జయన్,ఐశ్వర్య అనిల్ కుమార్ నిర్వహించారు
సంగీతం: లోపెజ్
డీఓపీ: ఫాహద్ అబ్దుల్ మజీద్
రచన, దర్శకత్వం,ఎడిటర్: రితికేశ్వర్ యోగి
నిర్మాతలు: టి జి విశ్వ ప్రసాద్, సింధు రెడ్డి, సుకుమార్ బోరెడ్డి
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఎస్ స్క్వేర్ సినిమాస్, సి ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: అక్టోబర్ 25 ,2024



పవన్ కళ్యాణ్ హిట్ మూవీ వకీల్ సాబ్ ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు శివకుమార్ రామచంద్రవరపు. ఈ రోజు సోలో హీరోగా ‘నరుడి బ్రతుకు నటన’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. (నరుడి బ్రతుకు నటన సమీక్ష)

కథ

కమల్ హాసన్ అభిమాని సత్య(శివ కుమార్) కి నటన అంటే చాలా ఇష్టం. దాంతో హీరో కావాలనే లక్ష్యంతో తగ్గే ప్రయత్నం చేశాడు. కానీ సినిమాకి సంబంధించిన వాళ్లతో పాటు బయటి వ్యక్తులు కూడా నటనకి పనికి రావని అంటారు. ఈ విధంగా అనుకోకుండా కేరళ లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. అక్కడ డి సల్మాన్( నితిన్ ప్రసన్న)అనే వ్యక్తితో ట్రావెల్ అవుతాడు. ప్రెగ్నెంట్ గా ఉన్న శృతి జయన్ తో కూడా సత్య కి అనుబంధం ఏర్పడుతుంది. సత్య కేరళ ఎందుకు వెళ్ళాడు? సల్మాన్ ఎవరు? సల్మాన్, సత్య ట్రావెలింగ్ లో ఏం జరిగింది? చివరకి సత్య నటుడు అయ్యాడా లేక మరేదైనా రంగాన్ని ఎంచుకోవాడా?అనేదే ఈ కథ.

ఎనాలసిస్
సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా డార్క్ కామెడీ తో ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ముఖ్యంగా ఈ కథకి డి సల్మాన్ క్యారెక్టర్ హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. స్టార్టింగ్ లో వచ్చిన సత్య సినిమా ప్రయత్నాల్ని, ఆ తర్వాత సత్య కి ఎదురయ్యే పరిస్థితులని కొంచం పెంచి చూపించాల్సింది. ఆ దిశగా దర్శకుడు ఆలోచించి ఉంటే సినిమాకి మరింత నిండుతనం వచ్చేది. అదే విధంగా సత్య, అతని తండ్రి మీద వచ్చే సీన్స్ కూడా ఇంకొన్ని ఉండాల్సింది. మొదట్లో షార్ట్ ఫిలిం ని సిల్వర్ స్క్రీన్ మీద చుస్తున్నామేమో అనే భావన వచ్చిందా కూడా కథలోకి వెళ్లేకొద్దీ ఆ ఆలోచనని విరమించుకుంటాం.ఇలాంటి కథ లకి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని విడమరిచి కూడా చెప్పుకోలేం. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో నిదానంగా సాగినట్టు అనిపించినా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం స్పీడ్ తో వెళ్ళింది. ముఖ్యంగా డి సల్మాన్, సత్యాల మీద చిత్రీకరించిన సీన్స్ చాలా నాచురల్ గా ఉండి ప్రేక్షకులని నవ్వుకునేలా చేస్తాయి. ఆ మధ్య వచ్చిన డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయి క్యారక్టర్ లో ట్విస్ట్ కూడా చాలా నాచురల్ గా బాగుండటమే కాకుండా ఆలోచింపచేసేలా ఉంది. క్లైమాక్స్ కూడా ఎంతో మందికి ఇన్ స్పిరేషన్ అవ్వచ్చు.

నటినటులు సాంకేతిక నిపుణుల పనితీరు
సత్య క్యారక్టర్ లో శివ కుమార్ (siva kumar ramachandravarapu) పర్ఫెక్ట్ గా సూటయ్యాడు.సంతోషం,బాధ,ఆవేశం ఈ మూడింటిలో కూడా చాలా బాగా చేసాడు. మంచి అవకాశాలు వస్తే తెలుగు తెరకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. డి సల్మాన్ క్యారక్టర్ లో నితిన్ ప్రసన్న (నితిన్ ప్రసన్న) అయితే సూపర్ గా చేసాడు. అసలు ఆ క్యారక్టర్ తన కోసమే పుట్టిందేమో అనిపించేలా నటించాడు. ఫ్యూచర్ లో నితిన్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అందరు డి సల్మాన్ అనే పేరుతోనే పిలుస్తారనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు.ఇక గర్భవతిగా చేసిన శృతి జయన్ (shrutie jayan) కూడా చాలా నాచురల్ గా చేసి సినిమాకి మంచి హెల్ప్ అయ్యింది.దర్శకుడు, రచయిత, ఎడిటర్ ఒకరే కాబట్టి ఆ పాత్రలలోను రితికేశ్వర్ యోగి (రితికేశ్వర్) ) విజయాన్నిసాధించాడు.నిర్మాణ విలువలు ఇలాంటి సినిమాలకి పెద్దగా కనిపించకపోయినా ఒక కొత్త రకం అనుభూతిని కలిగించే సినిమా ప్రేక్షకులకు అందించడంలో నూటికి నూరుపాళ్లు విజయాన్ని సాధించాయి. ఫొటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.

ఫైనల్ గా చెప్పాలంటే..

ఎక్కడా బోర్ కొట్టకుండా నాచురల్ కామెడీతో సాగిన ఈ మూవీ, రొటీన్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్: 2 .75 / 5 అరుణాచలం


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech