యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(దేవర)గత నెల సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్వీపాత్రాభినయాన్ని పోషించాడు.ఇక దేవర విడుదలై నేటికీ ఇరవై ఐదు రోజులు. అయినా కూడా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఎన్టీఆర్ కి ఉన్న స్టామినాని మరోసారి చాటి చెప్తుంది. ఓవర్ ఆల్ గా ఐదు వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారంగా కూడా వెల్లడి చేసారు.
రీసెంట్ గా మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది.ఒక్క నుంచే వంద కోట్లకు పైగా షేర్ ని రాబట్టిందనే సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది ఇంతవరకు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 మాత్రమే ఘనతని సాధించి ఇప్పుడు దేవర మూడవ చిత్రంగా నిలిచిందని అంటున్నారు. రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కొరటాల శివ(kortala siva)రీసెంట్ గా మాట్లాడుతూ దేవర రెండవ పార్ట్, మొదటి పార్ట్ కంటే వెయ్యి రెట్లు ఎక్కున బాగుంటుందని దర్శకుడు చెప్పిన నేపథ్యంలో పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆశగా నిలిచారు.దేవర సాధించిన విజయంపై ఎన్టీఆర్ కూడా కొన్ని రోజుల క్రితం చిత్ర బృందానికి పేరు పేరునా జ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. 1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో కనిపించారు.మొదటి పార్ట్ లో నటించిన స్టార్స్ అందరు పార్ట్ 2 లో కూడా కనిపించబోతున్నారు.