హైదరాబాద్ : వాసవి ఇంజనీరింగ్ కళాశాల (VCE) NSS విభాగం మరియు షీ టీమ్స్, తెలంగాణ పోలీస్,భాగస్వామ్యంతో ‘మహిళల భద్రత మరియు SPY కెమెరాలు’ పై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ ప్రముఖ అతిథిగా హాజరైన అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి ప్రసన్న లక్ష్మీ, (SHE TEAMS) మహిళల భద్రతపై ఆమె మాట్లాడుతూ, కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, సామాజిక మాధ్యమాలు, ప్రేమ సంబంధాలు, రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయడం, కొత్త ప్రదేశాలు వంటి వాటిపై మహిళలు అవగాహనతో పాటు వివిధ జాగ్రత్తలు తీసుకోవడం వివరించారు.కరాటే లక్ష్మి, రుద్రమ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు, షీ టీమ్ మెంబర్ అమ్మాయిలకు భద్రతా చిట్కాలను ప్రాక్టికల్‌గా ప్రదర్శించి అవగాహన కల్పించారు.
ఇన్‌స్పెక్టర్ ధనలక్ష్మి ఇన్‌స్పెక్టర్, షీ టీమ్స్ ప్రసంగిస్తూ, రాత్రి వేళల్లో లేదా ఒంటరిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాజ్ భవన్ నుండి ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ, మరియు కళ్యాణి గార్లు ఈ కార్యక్రమాలలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి. రమణ పాల్గొని, సదస్సు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వాసవి కాలేజ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో 425 మంది అమ్మాయిలు మరియు మహిళా అధ్యాపకులు ఉన్నారు.
ఈ సదస్సును వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ పి.వి. రావు మరియు ఎం. రవి కుమార్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది.