- ట్రిలియన్ ప్రముఖ ఆర్థిక వ్యవస్ధగా మార్చుతాం
- ఎక్కడికెళ్లినా రాష్ట్రం, హైదరాబాద్ గురించి చెప్పండి
- ఒలింపిక్స్ పథకాల సాధన లక్ష్యం
- ఎడ్యుకేషనల్ హబ్గా రాష్ట్రం
- నాయకులుగా ఎదుగాలంటే ధైర్యం ముఖ్యం
- నిత్యం ప్రజలతోనే మెలగాలి
- ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణను కేవలం న్యూయార్క్, పారిస్, లండన్‌తో పోల్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని, ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని, అదే తమ ముందు ఉన్న లక్ష్యమని. ఆ లక్ష్యాన్ని చేరాలని హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలని సీఎం చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు–- 2024లో సీఎం రేవంత్ రెడ్డి. ఐఎస్‌బీలోని విద్యార్థుల నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునేందుకు ఏడాదికోసారి ప్రముఖులు, వక్తలతో యాజమాన్యం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలంగాణలో 2, 3 ఏళ్లు పని చేయబోతున్నారు, తమ ప్రభుత్వం కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్‌ను అందిస్తానని చెప్పారు. ఒలింపిక్స్‌లో భారత్ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్‌లో ఉన్నారు.
త్యాగాలు చేయకుండా నాయకులం కాలేం
త్యాగాలు చేయకుండా నాయకులం కాలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి లీడర్ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలి. ప్రజలతో మమేకం అవ్వగలిగితే ఏదైనా సాధించవచ్చని చెప్పుకొచ్చారు. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని గుర్తు చేశారు. నాయకులు డబ్బు, వ్యక్తిగత జీవితం, సమయం ఇలా చాలానే త్యాగాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మంచి లీడర్, త్యాగం ఉండాలని కోరుకోవాలంటే. సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఐఎస్‌బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని చెప్పారు. ధైర్యం, త్యాగాలే నాయకత్వంలో ముఖ్య లక్ష్యాలు అని సీఎం రెడ్డి అన్నారు.
ప్రజల కోసమే ఉన్నత లక్ష్యం
ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని చేయడం, తెలంగాణ ఏకనమీని ఒక ట్రిలియన్ ఎకానమీగా, హైదరాబాద్ ఎకనమీని 600 బిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దామని, ఇప్పటికే రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువత కెరీర్ అవకాశాలు పెంపొందుతాయని, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సీటీ ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్స్ రావాలన్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ సిద్ధమవుతుందని, ఒలంపిక్స్‌లో పథకాలు సాధించేంత పెద్ద దేశంగా ఉండాలని, సౌత్ కొరియా వంటి చిన్న దేశం ఒలింపిక్స్‌లో అనేక పథకాలు సాధిస్తామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చి చూపిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐఎస్‌బీలోని ప్రతి ఒక్కరు ఒక్కో లక్ష్యంతో ముందుకు సాగాలని, మీరు ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడాలని, పెట్టుబడులు తెచ్చేందుకు కృషిచేయాలని.