Home తాజా వార్తలు పోలీస్ కుటుంబానికి రెండు కోట్ల పరిహారం – సీఎం రేవంత్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

పోలీస్ కుటుంబానికి రెండు కోట్ల పరిహారం – సీఎం రేవంత్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
పోలీస్ కుటుంబానికి రెండు కోట్ల పరిహారం - సీఎం రేవంత్ రెడ్డి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్
  • దేశానికే ఆదర్శం మన పోలీస్ వ్యవస్థ
  • ట్రాఫిక్‌లో ఐఐ వాడకం నియంత్రణ
  • డ్రగ్ కంట్రోల్ పై ఫోకస్
  • ఫ్రెండ్లీ పోలీస్ కేవలం బాధితులకే.. నేరస్తులకు కాదు
  • అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : అమరులైన పోలీసులకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కోట్ల మంది ప్రజలు హాయిగా నిద్రపోతున్నారంటే పోలీసులే కారణమని, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే శాంతి భద్రతలు కీలకమైన అంశమని గుర్తు చేశారు. శాంతిభద్రతలు లేని పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురారని చెప్పారు. తెలంగాణలో పోలీసులు అవసరమైతే తమ ప్రాణాలైనా వదులుతున్నారు కానీ శాంతి భద్రతల్లో రాజీ పడటం లేదని అభినందించారు.

హైదరాబాద్‌లోని మహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పరిహారం పెంపుపై కీలక ప్రకటన చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకుంటాయనే విశ్వాసాన్ని కల్పిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన అధికారులను గుర్తు చేసుకోవడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. అందుకే ఇప్పటి వరకు అమరులకు పరిహారం పెంచుతోంది. కానిస్టేబుల్‌, ఎస్సై అమరుడైతే… ఆ వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సై, సీఐ కుటుంబాలకు కోటి 25 లక్షల రూపాయలు, డీఎస్పీ, ఎస్పీ కుటుంబాలకు కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్ల రూపాయల పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. .

పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్

పోలీసులు ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ని 50 ఎకరాల్లో ప్రారంభించబోతున్నామని హామీ ఇచ్చారు. విద్యతోపాటు స్సార్ట్స్, గేమ్స్‌ను ఇందులో ప్రవేశపెడతామన్నారు. పోలీసు పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్క శాతం కూడా తప్పు జరగకుండా పోలీసులు సమన్వయంతో వ్యవహారించాలన్నారు. పోలీసులు సహనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలని హితవుపలికారు. సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ చనిపోతే ఆయన కుమారుడికి నిబంధనలు సడలించి మున్సిపల్ కమిషనర్‌గా ఇచ్చామని గుర్తు చేశారు.

దేశానికే ఆదర్శం

కె ఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర, కృష్ణ ప్రసాద్ లాంటి వందల మంది విధి నిర్వహణలో అమరులై స్ఫూర్తిగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్టు. నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త పద్దతుల్లో వస్తున్నారని, వారివడంలో కూడా తెలంగాణ పోలీస్ ఆదర్శంగా నిలిచిందని. ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని కితాబు ఇచ్చారు. సమాజంలో మార్పులను పోలీసులు నిశితంగా గమనించాలని సూచించారు రేవంత్. సైబర్ క్రైమ్స్‌లో చదువుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తున్నారు, క్షణికమైన వాటి కోసం ఈ వలలో పడుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్ కట్టడిలో తెలంగాణ పోలీసుల కృషిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందించారని గుర్తు చేశారు.

డ్రగ్స్ కంట్రోల్‌పై ఫోకస్

తెలంగాణలో గత పదేళ్లలో గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిందని, పక్క రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. నార్కోటిక్ బ్యూరోకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.

ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ వాడకం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించాలని సీఎం సూచించారు. భావోద్వేగం, ఉన్మాదంతో కొంతమంది మందిరాలపై దాడి చేయడం ద్వారా అలజడులు సృష్టిస్తున్నారని. తెలంగాణ ప్రజలు తెలివైన వారని ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉంటారు. ముత్యాలమ్మ గుడి ఘటన ఆందోళనకరమన్న రేవంత్… వెంటనే నేరస్తులను అరెస్టు చేసి ఎవరినీ ఉపేక్షించమనే సంకేతాలు ఇచ్చామన్నారు. నేరాలకు బాధితులే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నించారని రేవంత్. నేరాలకు ఎవరైనా వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని భయపడొద్దని భరోసా ఇచ్చారు. మొహర్రం, బక్రీద్, క్రిస్మస్, వినాయకచవితి, హనుమాన్ జయంతి ఉత్సవాల సమయంలో ప్రాథమిక సౌకర్యాలు లేకపోయినా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. జీతం ఉద్యోగాలు చేయడం లేదని… శాంతిభద్రతలు బాధ్యతగా భావించి పని కోసమేనని పోలీసులు ప్రశంసించారు.

బాధితులకే ఫ్రెండ్లీ, నేరస్తులకు కాదు’

ఇటీవల జరిగిన పోలీస్ నియామకంలో ఉన్నత విద్య అభ్యసించిన వారు కానిస్టేబుల్, ఎస్.ఐలుగా చేరారని సీఎం గుర్తు చేశారు. గొప్ప లక్ష్యం కోసం యువత పోలీస్ జాబ్స్‌లో చేరారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల కృషిని ప్రజలు గుర్తించాలని సూచించారు. క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీ పోలీస్ ఉండొద్దన్న ఆయన కఠినంగా ఉండాలి హితవుపలికారు. బాధితులతోనే ఫ్రెండ్లీగా ఉండాలన్నారు.
పోలీసులపైన తనకు ప్రత్యేక అభిమానం రేవంత్. ఆత్మగౌరవంతో బతుకుదామని… పోలీసులు గొప్పగా మాట్లాడుకునేలా పనిచేయాలని.. ఛీత్కరించుకునే పనులు జోలికి వెళ్లొద్దని సూచించారు. అమర్చు పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని. పోలీసుల గౌరవాన్ని పెంచేలా చర్యలు ఉండాలన్న రేవంత్.. ఇతరులకు ఖాకీలు ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech