బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’కి సీక్వెల్ గా రూపొందించిన ‘జై హనుమాన్’ (జై హనుమాన్)లో హనుమంతుడి పాత్ర ఎవరు పోషించారు అనే చర్చనీయాంశంగా జరుగుతోంది. మొదట చిరంజీవి (చిరంజీవి), రామ్ చరణ్ (రామ్ చరణ్), రానా (రానా) వంటి తెలుగు హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా కన్నడ హీరో రిషబ్ శెట్టి (రిషబ్ శెట్టి) పేరు తెరపైకి వచ్చింది.
‘కాంతార’ సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్. ఆ చిత్రం గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అందుకే ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రకు రిషబ్ అయితే బాగుంటాడని భావించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆయనను సంప్రదించగా ఓకే చెప్పాడట. అయితే రిషబ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు, లాభాల్లో వాటా అడగడంతో ‘హనుమాన్’ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని, మైత్రి మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది.
‘జై హనుమాన్’తో పాటు తెలుగులో మరో సినిమాకి కూడా రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందించబడింది. ‘జై హనుమాన్’ కంటే ముందు ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్తుందని వినికిడి.