57
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజ (86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సుదీప్ తల్లి సరోజ మృతి పట్ల సంతాపం తెలిపారు.
“ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీమతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉంటుందని శ్రీ సుదీప్ గారు తెలిపారు. సానుభూతి తెలియచేస్తున్నాను.” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు.