Home తెలంగాణ వివాదాల ‘కొండ’… వరుస వివాదంలో మంత్రి కొండా సురేఖ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

వివాదాల ‘కొండ’… వరుస వివాదంలో మంత్రి కొండా సురేఖ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
వివాదాల 'కొండ'... వరుస వివాదంలో మంత్రి కొండా సురేఖ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ల పట్టు
  • మంత్రిపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల తిరుగుబావుట
  • గాంధీభవన్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు
  • పీసీసీ చీఫ్‌తో భేటీ, హస్తినకు వెళ్తామని అల్టిమేటం
  • జిల్లాకు చెందిన వాటికి అన్నీ తానై చేసినట్లు విమర్శలు
  • పరకాల సెగ్మెంట్‌లో తాజా వివాదం
  • గ్రంథాలయ, భద్రకాళి టెంపుల్ చైర్మన్ల నియామకంలో మంత్రి చక్రం

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో వివాదస్పద మంత్రిగా ముద్ర వేసుకున్న కొండా సురేఖ పదవికి గండం పొంచి ఉంది. వరుస వివాదాలతో అధికార పార్టీనే ఇరకాటంలో పడేసిన సురేఖకు తన సొంత జిల్లా నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లే ఆమెపై తిరుగుబావుటా ఎగురవేయడం చర్చనీయాంశమైంది. సురేఖను మంత్రి పదవి నుంచి తొలిగిస్తేనే పార్టీలో కొనసాగుతామంటూ ఏకంగా టీపీసీసీ ఆల్టీమేటం జారీ చేయడం సంచలనం రేపింది. ఒకవేళ ఆమెపై చర్యలు తీసుకోకపోతే హస్తినలో తేల్చుకుంటామని తెగేసి చెప్పడం కలకలం రేపుతోంది. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నఆమె తన వ్యవహార శైలిని మార్చుకోకుండా అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రత్యర్థులను అటుంచితే సొంత పార్టీ నేతలే లక్ష్యంగా సురేఖ చేస్తున్న రాజకీయాలపై అధిష్టానం సైతం గుర్రుగా చూపుతోంది. కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన్నుఇరకాటంలో వెలివేయనే ఆలోచనతో సినీ హీరో నాగార్జున కుటుంబంపై ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం లేపాయో తెలుసా. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమా రంగంలోనూ పెద్ద సునామీనే సృష్టించాయి. అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా ఈ వివాదం సద్దుమణగలేదు. కాంగ్రెస్ ఈ వివాదం నుంచి బయటపడనే లేదు అప్పుడే కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకోవడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. తను పార్టీ నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆధిపత్యం కోసం జిల్లాకు చెందిన అధికార ఎమ్మెల్యేలు, సీనియర్లకు వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పటికే రేవూరితో ఆమె జగడం.. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోగా మంత్రి తీరును ఏకంగా ఏఐసీసీ, సీఎం దృష్టికి తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకునేందుకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ నెల 13న రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సమావేశమై కీలక చర్చలు జరిపారు. సీఎం వద్దకు మూకుమ్మడిగా వెళ్లాలని నిర్ణయించగా.. బుధవారం నేరుగా గాంధీభవన్ కు చేరుకున్న పలువురు నేతలు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆమె అన్నీ తానై వ్యవహరించారని ఆరోపించిన నేతలు గ్రంథాలయ, భద్రకాళి టెంపుల్ చైర్మన్ల నియామకంలో మంత్రి చక్రం తిప్పి అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తాజాగా పరకాల సెగ్మెంట్‌లో చోటు చేసుకున్న వివాదంపై పీసీ చీఫ్ వివరించారు. కొండా సురేఖతో తమ తమ నియోజకవర్గాల్లో పార్టీలో వర్గ పోరు విస్తరిస్తున్నదని.. ఇదే కొనసాగితే పార్టీ భవిష్యత్ కష్టమేననే అధినేత తీరుపై దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలపడాలంటే, ప్రభుత్వం పరువు దక్కాలంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

లేనిపక్షంలో నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో తాడోపేడో తేల్చమని ఆల్టిమేటం జారీ చేస్తామని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వర్సెస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దానికి తోడు మంత్రి తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యను బహిరంగంగానే. అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షురాలితోనూ అంత సఖ్యత లేదనేది బహిరంగ రహస్యమే. ఇక పశ్చిమ, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోనూ కొండ సురేఖ తన బలాన్ని చూపే ప్రయత్నం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన గీసుకొండ ఘటన పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడానికి పురిగొల్పింది.

దసరా సందర్భంగా పరకాలలో మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేదు. దీంతో ప్రకాశ్ రెడ్డి మద్దతుదారులు ఫ్లెక్సీలను చించేశారు. దీంతో మంత్రి వర్గీయులు, ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సీఐ సీట్లో తన మనుషులనే అరెస్ట్ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పార్టీ పెద్దలు కొండా సురేఖను హెచ్చరించినట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech