Home తెలంగాణ కూల్చేస్తే.. కొనుగోలు డబ్బు తిరిగిప్పిస్తాం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కూల్చేస్తే.. కొనుగోలు డబ్బు తిరిగిప్పిస్తాం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
కూల్చేస్తే.. కొనుగోలు డబ్బు తిరిగిప్పిస్తాం



  • చెరువులను ఆక్రమించి భారీగా అపార్ట్‌మెంట్లు
  • అ నిలకడ కూల్చివేయాలంటూ హైడ్రా నివేదిక
  • బాధితులకు బిల్డర్ల నుంచి పరిహారం
  • కొనుగోలు చేసిన సొమ్ము తిరిగి ఇప్పించే ప్లాన్
  • స్పష్టత వచ్చేవరకు కూల్చివేతలకు బ్రేక్..!

ముద్ర, తెలంగాణ బ్యూరో :హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. చెరువులను ఆక్రమించి భారీగా అపార్ట్‌మెంట్లు నిర్వహించి, అమ్ముకోవడంపై కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆయా బిల్డర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించాలని భావిస్తోంది. కూల్చివేతల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఈ నిర్ణయం వైపు మెగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే, ఇప్పటికే నివేదిక సమగ్ర నివేదిక తయారైనట్లు తెలుస్తున్నది. వరకు గుర్తించినట్లుగా కొన్ని ప్రాంతాల అపార్ట్‌మెంట్లు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే..?

“నగరంలో ఓ బడా నిర్మాణ సంస్థ బాచుపల్లిలో చెరువును ఆనుకొని ఎఫ్‌టీఎల్‌లోనే రెండు టవర్లను నిర్మించింది. దాదాపు అక్కడ 1000 మంది ఒక్కో ఫ్లాట్‌ను రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఎఫ్‌టీఎల్‌లోనే ఈ ప్లాట్లు ఉన్నందున హైడ్రా చర్యలు చేపడితే, అందులో ఉంటున్న వారంతా రోడ్డున పడే అవకాశం ఉంది. మూసాపేటలోనూ ఓ నిర్మాణ సంస్థ ఏకంగా చెరువు ఎఫ్‌టీఎల్‌ను మార్చేసి అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసింది. ఇవే కాకుండా నగరంలో అక్రమ నిర్మాణాలు భారీగానే ఉన్నాయి. ఇందులో కొన్ని తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం అయితే వీటిని హైడ్రా కూల్చివేయాల్సిందే. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నో ఏళ్ల కింద కొనుగోలు చేసిన సామాన్యులు రోడ్డునపడతారని. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాల కూల్చివేతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం సమగ్ర నివేదిక సిద్ధం చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలల వ్యవధిలో వందలాది ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను మాత్రమే నేలమట్టం ఉన్నాయి.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని.. అసలు అది చెరువుల బఫర్, ఎఫ్‌టీఎల్ జోన్ అనేది తెలియకుండానే పేదల బిల్డర్ల వద్ద నుంచి ఆ ఇండ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బిల్డర్ల మోసానికి బలేపోయే పేదలను ఆదుకోవాలని హైడ్రా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.

ఇండ్లు కోల్పోయిన పేదలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించినట్లు తెలిసింది. అయితే ఈ సూచన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాలని భట్టి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై త్వరలో రేవంత్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టపోయిన పేదలకు బిల్డర్ల నుంచే పరిహారం అందజేసే విధంగా విధానపర నిర్ణయం తీసుకోవచ్చు. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 2 వేలకుపైగా నిర్మాణాలు అక్రమంగా నిర్మించారు. ఆయా నిర్మాణాలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో ఉన్నట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. వీటిలో చాలా వాటికి జీహెచ్‌ఎన్‌డీఏ, పంచాయతీలు అనుమతులు కూడా తీసుకున్నారు.

ఈ నిర్మాణాలకు అనుమతుల విషయంలో అధికారులు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. కొందరు బిల్డర్లు ఒక సర్వే నంబరులో అనుమతులు తీసుకొని మరో సర్వే నంబరులో ఇండ్లను నిర్మించారు. ఇవేమీ తెలియని పేదలు బిల్లర్లను గుడ్డిగా నమ్మి ఆయా ఇండ్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ నిర్మాణాలు కూల్చితే.. కొనుగోలు చేసి పేదలు తీవ్రంగా నష్టపోతారని హైడ్రా అధికారులు. దానితో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉందని హైడ్రా ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సీనియర్ మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా అక్రమ నిర్మాణాలు పేదలకు అంటగట్టిన బిల్డర్‌ నుంచి కొనుగోలుదారులకు పరిహారం ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై స్పష్టత వచ్చే వరకు కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలిసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech