- ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
- ఎంతటి సీనియర్లయినా పార్టీ గీత గతిస్తే వేటు తప్పదు
- రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి
- గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాల్సిందే
- హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించేలా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలన్న మహేశ్ కుమార్ గౌడ్… ఎంతటి సీనియర్ అయినా పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారు పేరన్న ఆయన పార్టీ గౌరవాన్ని భంగం కలిగించే వారిని ఉపేక్షించబోమని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయన్న పీసీసీ చీఫ్.. ఆ మేరకు విజయం సాధిస్తేనే పార్టీకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుత పాలన అందించింది. రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్నపనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లోమంచి స్పందన. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని. అందుకు సోషల్ మీడియా ను పావుగా వాడుకుంటున్నందున. ఆయా పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పీలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలు, నాయకులు వారి మధ్య ఉన్న విభేదాలు అన్నీమరిచిపోయి కలిసి పని చేయాలని సూచించారు. పార్టీ పటిష్టత కోసం పని చేస్తూ రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్‌తో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాధం, మేయర్ విజయలక్ష్మి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, స.మీరుద్దీన్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ ఉన్నారు.