Home తెలంగాణ విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన ఘటన కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నివాసం ఉంటున్న రాజు- జమునకు ఐదేళ్ల వయసు ఉన్న కూతురు ( ఉక్కులు ) ఉంది. నిన్న ఉదయం వాళ్ళ కూతురు ఉక్కులు తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది.

దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ డాక్టర్ హన్మకొండకు రిఫర్ చేశారు. దీంతో ఆమె హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉక్కులుకు వైద్యులు పరీక్షలు చేస్తుండగా ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించినట్లు గుర్తించారని వైద్యులు చెబుతున్నారు. కళ్ళ ముందే తమ పసికూన చనిపోవడాన్ని చూసి గుండెలు బాదుకుంటున్న తల్లిదండ్రుల బాధ స్థానికంగా కలచి వేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech