- ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్,ఎన్.ఎఫ్.సి కేంద్రాలు
- వీఎల్ఎఫ్ ను వివాదం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర
- 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపులు
- ప్రజలకు అన్యాయం అపోహ మాత్రమే
- ప్రాజెక్టు ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి
- రాజ్ నాధ్ సింగ్ చెప్పిన వెంటనే స్పందించాం
- ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యం
- దామగుండం వీఎల్ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ రక్షణలో తెలంగాణ మరో మైలురాయి దాటిందని సీఎం రేవంత్ రెడ్డి. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సి లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నసీఎం.. వీఎల్‌ఎఫ్ నెవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో కీలక అడుగు ముందుకు వేసింది. దేశ భద్రతకు సంబంధించిన ఈ వీఎల్‌ఎఫ్‌ను కొందరు వివాదం చేసేందుకు ప్రయత్నించారు. ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మించతలపెట్టిన దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ ఎఫ్ నేవీ రాడార్ ప్రాజెక్టు పనులను మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1990లోనే తమిళనాడులోనూ ఇలాంటి ప్రాజెక్టును ప్రారంభించడం వల్ల అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతం రావడం గర్వకారణమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. వివాదాలకు తెరలేపుతున్న వారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలని సూచించారు. దేశం ఉంటేనే మనం ఉంటామన్న సీఎం మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణం జరిగింది. 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన సీఎం వివరించారు.
కేంద్రానికి మద్దతు ఇస్తాం
వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రాజెక్టును ప్రారంభించాలని అడిగిన వెంటనే తాము స్పందించామని చెప్పారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే అధికారులను సిద్ధం చేసినట్లు పనులు. దేశం, ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలమని పర్యావరణ ప్రేమికులను ఉద్దేశించి చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదం చేయడం సమంజసం కాదని సూచించింది.
ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు రాజకీయాలు ఉంటాయన్న దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లినా సీఎం అవసరం… కాగా స్ధానికంగా ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆలయానికి ఇబ్బందులు కలిగించడాన్ని కోరిన ఆయన ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి చూపించారు. అలాగే ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో స్ధానిక ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, నేవీ ఉన్నారు.