కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం ‘క'(క).1970 వ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా పాన్ ఇండియా లెవల్లో ఈ నెల 31న విడుదల కాబోతుంది.ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన్ పోస్టర్స్ అండ్ టీజర్ తో ప్రేక్షకుల్లో కూడా ‘క’ పై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతుండగా హీరో కిరణ్ అబ్బవరం పలు ఆసక్తికర విషయాలని వెల్లడి చేసాడు. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అనుకున్నాం. కానీ తమిళనాడులో ముప్పై ఒకటి విడుదల అవ్వడం లేదు. ఎందుకంటే తమిళనాడు లో వాళ్ళ హీరోల సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ దొరకడం కష్టమని, కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేద్దామని ‘క’ తమిళనాడు రైట్స్ కొన్న వాళ్ళు చెప్పారని విషయాన్నీ వెల్లడి చేసాడు.
కిరణ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో మన తెలుగు నాట సంక్రాంతితో పాటు చాలా ఫెస్టివెల్స్ అప్పుడు మన హీరోల సినిమాలు ఉన్నా కూడా తమిళ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాంటిది మన హీరోకి తమిళనాట ఎందుకు థియేటర్లు ఇవ్వరని అనేక సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.