మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మధ్య బాక్సాఫీస్ వార్ కి తెలుగునాట ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి ఈ ఇద్దరూ తలపడితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అయితే ఈసారి 2025 సంక్రాంతికి కూడా చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడాల్సి ఉండగా.. లాస్ట్ మూమెంట్ లో చిరుకి బదులుగా ఆయన తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు.
బాలకృష్ణ (బాలకృష్ణ) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం ఈ సినిమాకి ‘వీర మాస్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి తాజాగా మేకర్స్ విడుదల చేసారు. (NBK 109)
రామ్ చరణ్ (రామ్ చరణ్) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సిన చిరంజీవి ‘విశ్వంభర’ వాయిదా పడడంతో, ఇప్పుడు ఆ తేదీకి ‘గేమ్ ఛేంజర్’ వస్తోంది. (గేమ్ ఛేంజర్)
కాగా, 2019 సంక్రాంతికి కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో బాలకృష్ణ, ‘వినయ విధేయ రామ’తో రామ్ చరణ్ బరిలోకి దిగారు. అప్పుడు ఇద్దరికీ నిరాశే ఎదురైంది. మరి ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.