మెగాస్టార్ చిరంజీవి (మెగాస్టార్ చిరంజీవి) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’ (విశ్వంభర). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేసేలా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. (విశ్వంభర టీజర్)
విజయదశమి కానుకగా ‘విశ్వంభర’ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. నిమిషంన్నర నిడివి గల ఈ టీజర్ విజువల్ వండర్ లా ఉంది. “విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకొస్తుంది.” అని వాయిస్ వస్తుండగా అద్భుతమైన విజువల్స్ తో టీజర్ సాగింది. అవతార్ సినిమా తరహాలో మనుషులు, జంతువుల రూపాలు కొత్తగా ఉండటం విశేషం. ఇక ఒక చిన్న పాప “రుద్రా.. యుద్ధం వస్తుంది అన్నావుగా.. ఎలా ఉంటుంది ఆ యుద్ధం” అని అడగగా.. రెక్కల గుర్రం మీద చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. విజువల్స్, మ్యూజిక్ టాప్ అన్నీ క్లాస్ లో ఉన్నాయి. టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాతో దర్శకుడు వశిష్ట చిరంజీవితో కలిసి సంచలనం సృష్టించబోతున్నాడని అర్థమవుతోంది.
కాగా, ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ కి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో వేసవిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి.