మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)చేతుల మీదుగా ఏ తర్వాత పెట్టిన శుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.ఆ నమ్మకంతోనే ఇండస్ట్రీ కాకుండా బయట వాళ్ళు కూడా చిరు చేతుల మీదుగా తాము అనుకున్న కార్యాన్ని ప్రారంభిస్తారు. మీడియాలో ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి చేతుల మీదుగా తమ ఛానల్ ని ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఈ కారణంగానే తాజాగా మెగా 9(mega 9 tv)అనే నూతన ఛానల్ ని చిరంజీవి ప్రారంభించడం జరిగింది. అనంతరం చిరంజీవి మాట్లాడటం మెగా 9 టీవీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మెగా యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.రాబోయే రోజుల్లో ఛానల్ దుమ్ము దులిపెయ్యాలని చెప్పాడు. ఛానల్ లోగోని ఆవిష్కరించి దాని మీద తన ఆటో గ్రాఫ్ కూడా చేసాడు. అడగగానే తమ మెగా 9 టీవీ ని ప్రారంభించిన చిరంజీవి కి ఛానల్ నిర్వాహకులు ధన్యవాదాలు కూడా చెప్పారు.