47
అక్కినేని నాగార్జున(nagarjuna)కుటుంబంపై ఇటీవల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)కొన్ని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దీంతో నాగార్జున, అమల(అమల)నాగ చైతన్య(naga chaitanya)అఖిల్(akhil)తో పాటు అక్కినేని అభిమానులు కూడా రంగంలోకి దిగి సురేఖ మాటలని ఖండించమే కాకుండా ఇక పై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు.
ఇక ఈ విషయంపై నాగార్జున హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసాడు.ఈ మేరకు కోర్టులో ఈ రోజు పిటిషన్ మీద విచారణ జరగబోతుంది. దీంతో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకి సురేఖ క్షమాపణలు కూడా చెప్పింది.