- హామీల గారడి,హైడ్ర డ్రామాతో వంచన
- రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి
- కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
ముద్రణ,పానుగల్:- బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం పానుగల్ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలోని రామన్న గట్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. అయితే గ్రావిటీతో పానుగల్ మండలం శశ్యామలంగా మారుతుందని, శాశ్వతంగా రైతుల సాగునీటి కష్టాలను తీర్చే అతి పెద్ద స్కీం రామన్నగట్టు రిజర్వాయర్ అని అన్నారు.రామన్న గట్టు రిజర్వాయర్ ను వెంటనే చేపట్టి దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పరిశీలన.ప్రభుత్వం గనుక నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా పాన్ గల్ మండలం రైతాంగం తరపున బిఆర్ఎస్ పార్టీ ముందుండి ఉద్యమం చేస్తున్నదని,రామన్న గట్టు నిర్మాణం చేపట్టి సాగునీరు అందించేదాకా పోరాడుతామన్నారు.గోప్లాపూర్ స్టేజ్ దగ్గర నుండి రేమద్దుల వరకు గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కిష్టాపూర్ ,కిష్టాపూర్ తాండ రేమొద్దుల గ్రామాలలో రోడ్డు నుండి మినహాయించి నేటికీ బీటీ రోడ్డును పూర్తి చేయలేదని,బిల్లులు ఎత్తలేదని పనిచేయకుండా తిరుగుతున్న గుత్తేదారు జగ్గారెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ రైతు పక్షపతి కాబట్టే రైతు రాజు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు సాగునీరు అందించి రైతును రాజు చేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.సమావేశంలో మాజీ ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి,ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,మాజీ రైతుబంధు మండల కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుధాకర్ యాదవ్,సంగనమోని శేఖర్,రాజేష్ రెడ్డి,వీర,మాజీ సర్పంచులు చంద్రునాయక్,బాలస్వామి, నరసింహ,తిరుపతి,మాజీ ఎంపీటీసీలు కృష్ణ,కరుణాకర్ రెడ్డి,నాయకులు సుధాకర్ నాయక్,నిరంజన్ రెడ్డి,రామకృష్ణ,నాగరాజు,రమణ,రాముడు ఉన్నారు.