56
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే.. ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. దీంతో ఆదివారం ఉదయం నుంచి భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొదటి మూడు రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.