Home తెలంగాణ నక్సలైట్ అని బెదిరించి 50 లక్షలు డిమాండ్…. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

నక్సలైట్ అని బెదిరించి 50 లక్షలు డిమాండ్…. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
నక్సలైట్ అని బెదిరించి 50 లక్షలు డిమాండ్.... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • నిందితుడి అరెస్టు – జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

ముద్రణ ప్రతినిధి, వనపర్తి : దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు కష్టపడకుండా ధనవంతులుగా మారాలంటే దుర్బుద్ధితో నక్సలైట్ అవతారమెత్తి అమాయకులను బెదిరించి పోలీసులకు పట్టుబడిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. శుక్రవారం రోజు జిల్లా పోలీసు ఎస్పీ రావుల గిరిధర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంఘటనకు సంబంధించిన వివరాలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, మామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి మాజీ నక్సలైట్ గా చెప్పుకొని సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి రైస్ మిల్లు అసోసియేషన్ నుంచి 50 లక్షలు డిమాండ్ చేశాడు. నేను మాజీ నక్సలైట్ నని చెప్పి అడిగిన డబ్బులు వెంటనే ఇవ్వకుంటే మిమ్మల్ని చంపుతానని చెప్పి బెదిరించాడు.

తేనేటి రెడ్డి ఫిర్యాదు మేరకు ఘనపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి సాంకేతిక సహాయం, కేసు దర్యాప్తులో నమ్మదగిన నిందితుడి కోసం గాలిస్తున్న ఖిల్లాఘణపురం బస్టాండ్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా నిందితుడిని ఖిల్లాఘనపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో నిందితుడు తను చేసిన నేరం ఒప్పుకున్నాడు .

గతంలో సుదర్శన్ రెడ్డి ఆత్మరక్షణ మేరకు గన్ లైసెన్స్ తీసుకొని అక్కడ నుండి హైదరాబాదులోని ముషీరాబాద్ 200 సంవత్సరంలో వచ్చి చార్మినార్లో వెపన్ 3.2 రివాల్వర్ జర్మనీ కంపెనీకి చెందిన దానిని కొన్నాడు. ఇక్కడ ఒక సంవత్సరం నుండి హబ్బిగూడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.

తన దగ్గర ఉన్న రివాల్వర్ చూపించి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవాడు. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్స్ వర్క్ ప్రారంభమైంది. 2015 నుంచి అతనికి వ్యాపారంలో అప్పులు ఎలాగైనా ఆర్థికంగా ఎదగాలని చేసిన అప్పులను తీర్చాలనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న రివాల్వర్ చూపించి బెదిరించి 15 లక్షల మంది పెద్దపల్లిలో ఒక రైసుమిల్ ఓనర్ను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత అదే విధంగా మరి కొందరిని బెదిరించి ఎక్కువ డబ్బులు సంపాదించడంతో సుల్తానాబాద్, కరీంనగర్, సుబేదారి, మిర్యాలగూడ వంటి ఏరియాలలో కూడా కొంతమందికి డబ్బులు బెదిరించారు. ఆ ఏరియాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యి జైలు పాలయ్యాడు.

అదేవిధంగా జస్ట్ డయల్ ఆప్ అనే వారికి ఫోన్ చేసి వనపర్తి ఉన్న కొంతమంది రైసుమిల్ యాజమానుల నంబర్లు అందించాలని కోరగా కొందరి నెంబర్లు ఇచ్చారు. అదేరోజు రాత్రి అందాజ 10 గంటల సమయంలో ఆ నెంబర్లలో ఒకటైన శేఖర్ రెడ్డి నెంబర్ కు ఫోన్ చేసి తాను నక్సలైట్ను అని రైస్ మిల్లర్ అసోసియేషన్ నుంచి 50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని ఈ విషయం ఎవరికైన చెప్పుతే చంపుతానని బెదిరించాడు. తేదీ :02-10-2024 నాడు ఉదయం 9 గంటల సమయంలో బోడుప్పల్‌లోని మనీ ట్రాన్స్‌ఫర్ దగ్గరికి వెళ్లి తెలిసినవారు డబ్బులు ఇచ్చారు. నీ ఫోన్ పే నెంబరు ఇవ్వమని అడిగితే శేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి అత్యవసరంగా 8 వేలు ఫోను పే చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు దాంతో అతను భయపడి ఫోన్ పే చేసాడు. ఆ తర్వాత కూడా ఇంకా డబ్బులు కావాలని శేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి మళ్లీ బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని చంపుతానని బెదిరించాడు ఖిల్లాఘనపూర్ ఎస్సై నిందితుడిపై నిఘా పెట్టి చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలను ఒప్పుకున్న జిల్లా ఎస్పీ తెలిపారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాలు పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరిక. ఈ కేసును తొందరగా చేదించిన కొత్తకోట సీఐ రాంబాబు, ఖిలా లింగపూర్ ఎస్సై సురేష్, పోలీస్ కానిస్టేబుళ్లు, రాజులను జిల్లా ఎస్పీ అభినందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech