44
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే దేవీ నవరాత్రి ఉత్సవాలకు సర్వత్రా సిద్ధం చేశామని ఆలయ ఈఓ రామారావు ఏర్పాటు చేశారు.
ఈ ఉత్సవాల సందర్భంగా కనకదుర్గా దేవిని దర్శించుకునేందుకు 13 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు పరోక్ష సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.