Home సినిమా తలైవా అభిమానులకు శుభవార్త.. ఆసుపత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌! – Sneha News

తలైవా అభిమానులకు శుభవార్త.. ఆసుపత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌! – Sneha News

by Sneha News
0 comments
తలైవా అభిమానులకు శుభవార్త.. ఆసుపత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌!


నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ను చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు చికిత్స అందించారు డాక్టర్లు ఆయన కోలుకోవడం డిశ్చార్జ్. వారం రోజులపాటు వైద్యులు సూచించారు. ఈరోజు ఉదయం తన నివాసానికి చేరుకున్నారు రజినీ. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడడంతో వైద్యులు ఆయనకు స్టంట్‌ అమర్చారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా తలైవాకు స్టెంట్‌ వేసినట్టు అపోలో వైద్యులు తెలిపారు.


తమ హీరో ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారని తెలుసుకున్న సూపర్‌స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చేవారం రజినీ కొత్త సినిమా ‘వేట్టయాన్‌’ రిలీజ్ కాబోతోంది. ఈ సమయంలో సూపర్ స్టార్ అనారోగ్యానికి గురి కావడం అభిమానులను బాధించింది. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రజినీ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో రజినీకాంత్‌ సతీమణి లత మీడియా ముందుకు వచ్చి రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందనే శుభవార్తను అభిమానులకు చెప్పారు. ఇక వచ్చే వారం దసరా కానుకగా రిలీజ్ కానున్న తలైవా కొత్త సినిమా సంబరానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech