51
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.తొలిరోజు గురువారం అమ్మవారికి అర్చకులు స్నాపనాభిషేకం నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారి దర్శనం కోసం గురువారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వినాయకుని గుడి వద్ద నుండి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు.