42
‘నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి’, ‘కొండ సురేఖ డౌన్ డౌన్’.. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌కు చెందిన అక్కినేని అభిమానులు ఈరోజు పట్టణం నడిబొడ్డున కొండ సురేఖ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తమ అభిమాన హీరో కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఆరోపణలు, వివాదస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఆమె వ్యాఖ్యలను ఖండిరచారు. సమంత కూడా ఘాటుగా స్పందించారు. అలాగే అక్కినేని అమల తీవ్రమైన పదజాలంతో కొండా సురేఖ వైఖరిని తప్పుపట్టారు.