‘దేవర’ (దేవర) సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంటే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదే ఊపులో మీట్ కోసం ఎంతగానో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు వారికి ఊహించని షాక్ తగిలింది. పర్మిషన్ లభించని కారణంగా సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది. (దేవర సక్సెస్ మీట్)
నిజానికి ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లో అవుట్ డోర్ లో ఘనంగా చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ వర్షాలు, అనుమతులు వంటి కారణాల వల్ల.. ఇండోర్ కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ లోని నోవొటెల్ లో 5000 మందితో ఈవెంట్ ప్లాన్ చేయగా, ఏకంగా 35 వేల మంది రావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా చివరికి ఈవెంట్ ని రద్దు చేశారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. అందుకే సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పుడు సక్సెస్ మీట్ ని కూడా రద్దు చేశారు. దేవర సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత నాగవంశీ.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరగ, సక్సెస్ మీట్ ని నిర్వహించాలని తారక్ అన్నతో పాటు అందరం భావించాం. కానీ దసరా కావడంతో అవుట్ డోర్ లో ఈవెంట్ చేయడానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించలేదు. మా చేతుల్లో ఏమి లేదు. అభిమానులు, ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అంటూ నాగవంశీ రాసుకొచ్చారు.