- ఇంటింటా బతుకమ్మ రంగురంగుల పూలతో పేర్చిన మహిళలు
- గ్రామాల్లో చెరువుల వద్ద బతుకమ్మలను ఆట పాటలతో పూజించిన మహిళలు
- బతుకమ్మ పండుగ వాతావరణంతో కళకళ లాడుతున్న గ్రామాలు
- ఎంగిలిపూల బతుకమ్మకు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో అంతరాయం
- బతుకమ్మ సంబరం జరుపుకుందామనుకున్న మహిళలు ఇండ్లకే పరిమితమైన వైనం
తుంగతుర్తి ముద్ర :- తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న బతుకమ్మ బుధవారం మహాలయామావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ఈ సందర్భంగా గ్రామాలలోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో బతుకమ్మను ముందుగా పేర్చి తాము వండుకున్న పిండి వంటలు నైవేద్యంగా పెట్టి అనంతరం భోజనం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం అందులో భాగంగా ఈ ఏడాది ఎంగిలిపూల బతుకమ్మ తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు ఇంటింటా బతుకమ్మ ఆయా గ్రామాలలో చెరువుల వద్ద దేవాలయాల వద్ద సమూహంగా చేరి వివిధ రకాల పాటలతో ఆటలతో బతుకమ్మను పూజించారు . తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మహిళలు బతుకమ్మలతో తమ ఇళ్లకే పరిమితమయ్యారు.