ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ చేస్తున్న డ్రామాలు కాంగ్రెస్ నేతలకు రావని.. తాము ప్రాక్టికల్ గా ఉంటామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదంటూ ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతలు చేసిన దీక్షపై బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్రంలో తన రాజకీయ ఉనికి పెంచుకునే పనిలో పడి ఉంది. అందుకే కాంగ్రెస్ పాలనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రుణమాఫీ ప్రకారం గుర్తించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా రు. 31వేల కోట్ల రుణమాఫీకి తీర్మానం చేసి…రూ.18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మిగిలినవి డాటా సరిగా లేక ఆలస్యం అవడంతో. దీంట్లో దాచుకునేది ఏముంది? అని ప్రశ్నించారు. అసలు తమ పాలనను విమర్శించే హక్కు బీజేపీకి లేదని.
ఎన్నికల సమయంలో నల్లదనం తెచ్చిన ప్రతీ పేదవాడి అకౌంట్ లో వేస్తానన్న ప్రధాని మోదీ మాట తప్పింది. పదేండ్లు అధికారంలో ఉండి పేదల ఖాతాలోకి చిల్లి గవ్వ అయిన వేశారా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. ఈ లెక్కన 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఇందులొ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చర్చకు సిద్దంగా ఉన్నారా..? అన్ని సవాల్ విసిరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర నేతలు తమ హామీని విస్మరించారన్నారు. దేశ రైతుల నడ్డి విరిచేలా నల్ల చట్టాలు తెచ్చింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. దీక్షలు చేస్తున్న రైతులను తొక్కి చంపిన చరిత్ర మీది అని ఉంది.కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తులం బంగారం రూ. 28 వేలు ఉంటే మోడీ అధికారంలోకి వచ్చాక రూ. లక్షకు అయ్యి ఉంది. వీటికి తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.