Home తెలంగాణ కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో :-తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నైజం చాటుకున్నాడని మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే ఆయన గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టమన్నారు. మా నోళ్లను పినాయిల్ తో కడగలనీ మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్ అని ఉంది.
పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ యాసిడ్ తో కడగాలన్నారు.

పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషన్ అయిందని ధ్వజమెత్తారు.గతంలో రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అన్నాడని గుర్తు చేశారు. బతుకమ్మ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మహిళా మంత్రుల గురించి చాలా చులకనగా మాట్లాడడం….ఆయన దిగుజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలు మీకు బుద్ధి చెప్పేవారని అన్నారు. మహిళా మంత్రులను పదే పదే కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడని.

చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడాలని సవాల్ విరిసారు,నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. దూషణలకు, భూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరేనని అన్నారు.నేను వ్యక్తిగతంగా దూషించినట్లు దమ్ముంటే కేటీఆర్ ఆధారాలు చూపించాలన్నారు.రాజకీయాల్లో మేం ఉండకూడదన్న లక్ష్యంతోనే టిఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మాపై పదేపదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాం. కనీసం సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్ కి లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నువ్వు ఇలానే రెచ్చిపోతే రేపు మీ కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సి వస్తుందని సీతక్క హెచ్చరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech