శని, ఆదివారాల్లో ఎందుకు కూలుస్తున్నారు ? అని తెలంగాణ హైకోర్టును హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలను తొలగించే పనిలో నిమగమైన హైడ్రా ‘హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ’ శని, ఆదివారాల్లోనే కూల్చివేతలు చేపట్టింది. తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా. అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలి ? అని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని కోర్టు గుర్తు చేసింది.