ఆలేరు. ముద్ర :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గాన్ని బస్ స్టేషన్ అనేక అక్రమాలకు కేంద్రంగా మారిందని ప్రజలు అంటున్నారు. నిత్యం హైదరాబాదు నుండి వరంగల్, వరంగల్ నుండి హైదరాబాదుకు వేలాదిమంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. స్టేషన్లో రక్షణ కరువై అక్రమార్కులు అడ్డగా బస్సులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాగుబోతులు నిత్యం మద్యం మత్తులో గొడవలు సృష్టించిన సంఘటనలు అనేకం జరిగాయి.
విద్యాసంస్థల ముగింపు సమయంలో కొంతమంది యువకులు బస్ స్టేషన్లో ద్విచక్ర వాహనదారులపై ప్రమాదకరంగా విన్యాసాల వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిత్యం ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీగా ఉన్నాయి. రాత్రి వేళలో బస్ స్టేషన్ లో విద్యుత్ దీపాలు లేక చీకటిగా ఉండటంతో అక్రమార్కులు తమకు న్యాయంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సంబంధిత అధికారులు పటిష్టమైన వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.