Home తెలంగాణ రెండవ దశ మెట్రో అలైన్ మెంట్ మార్పు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

రెండవ దశ మెట్రో అలైన్ మెంట్ మార్పు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
రెండవ దశ మెట్రో అలైన్ మెంట్ మార్పు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఆరు కారిడార్లలో రైలు పరుగులు
  • కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
  • 116.2 గృహాల పనులకు గానూ రూ.32వేల 237 కోట్ల వ్యయం
  • తొలిసారిగా 1.6 కి.మీ భూగర్భంలో మెట్రో పరుగులు

ముద్ర, తెలంగాణ బ్యూరో :- హైదరాబాద్ మెట్రో రెండవ దశ పనులకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. గతంలో నిర్ణయించిన ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్ మెంట్ మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పనులు అతి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. సంబంధిత అధికారులు తుది మెరుగులు దిద్దే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు..సెకండ్‌ ఫేజ్‌లో మొత్తం 116.2 మేర మెట్రో విస్తరించి ఉంది. ఇందుకుగాను రూ.32 వేల 237 కోట్లను వెచ్చించనుంది.

రెండవ దశ విస్తరణ పనులకు సంబంధించిన రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ పనుల ప్రారంభ ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో సెకండ్ ఫేజ్ పనులను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులతోపాటు ఆరాంఘర్‌-బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైనును ఖరారు చేసింది. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు కారికార్లతో మెట్రో సెకెండ్ ఫేజ్ పరుగులు పెట్టనుంది. కాగా తొలిసారిగా ఎయిర్ పోర్ట్ కారిడార్‌లో 1.6 మేర మెట్రో రైలు భూగర్భంలో వెళ్లనుంది.

రెండో దశ కారిడార్లు ఇవే..

కారిడార్ నాలుగు (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవును కవర్ చేస్తుంది. ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చంద్రాయణ్ గుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్ హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ ఎయిర్ స్టేషన్ పోర్ట్ స్టేషన్‌తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు.
కారిడార్… కిందV రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయో డైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మించారు. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్ కాగా….. ఇందులో దాదాపు 8 స్టేషన్లు.

కారిడార్ ..6 కింద (ఓల్డ్ సిటీ మెట్రో) ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్‌ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా పేరుగా ఉంచుతారు. ప్రస్తుతం దారుల్‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు; శాలిబండ జంక్షన్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు ఏకరీతిగా 100 అడుగులకు విస్తరిస్తారు. స్టేషన్ ఉండే స్టేషన్లలో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తారు.

కారిడార్ …7 కింద ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభించి, పటాన్‌చెరు వరకు ఉన్న ఈ 13.4 కి.మీ లైన్ ఆల్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్‌ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ కారిడార్…కారిడార్…8లో విజయవాడ హైవేపై ఎల్బీ నగర్ వైపు నుంచి రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిమీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళ్తుంది. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి. మరోవైపు రూ.8 వేల కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech