35
తెలంగాణ సీనియర్ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కు పితృ వియోగం కలిగింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం స్వర్గస్తులయ్యారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు సంబంధింత సమస్యలతో ఆయన మంచం పట్టారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. పురుషోత్తం రెడ్డి మృతికి సీఎం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, సీనియర్ నేతలు సంతాపం తెలిపారు. మంత్రి ఉత్తమ్ ను పరామర్శించారు.