- కాంగ్రెస్ లో పీసీసీ బీసీ
- అధికార పార్టీ కులగణన గానం
- బీజేపీలో బీసీ సీఎం నినాదం
- బీఆర్ఎస్ బీసీ జపం
- బీసీ బిల్లు కోసం ఆర్ కృష్ణయ్య రాజీనామా
- కృష్ణయ్య కు బీజేపీ మళ్లీ రాజ్యసభ..?
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీసీ రాజకీయం మొదలైంది. బీసీ కులగణన, స్థానిక సంస్థలు,చట్టసభల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో బీసీ నేతలందరూ ఏకమవుతున్నారు. అధికార, విపక్ష నేతలతో పాటు ఉద్యమ, ఉద్యోగ, స్వచ్చంద సంఘాల నాయకులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాఫ్ట్రంలో రాజ్యాధికారం సాధించేలా ఇప్పట్నుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ పక్షం రోజుల క్రితం నుండి రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు రాజకీయ పార్టీలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చుట్టూ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నాయి.
ఏపీలో ఉన్న వైసీపీ నుంచి అధికారం చేపట్టిన కృష్ణయ్య మిగిలి ఉన్న నాలుగేళ్ల పదవీ కాలానికి ముందే తన పదవికి రాజీనామా చేయడంతో ఇరురాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో ఉన్న ఆ వర్గానికి చెందిన నేతల్లోనూ చలనం వచ్చింది. రాజీనామా చేసిన హైదరాబాద్ కేంద్రంగా వివిధ పార్టీలకు చెందిన బీసీ నేతలతో సమావేశాలు అయిన కృష్ణయ్య ఉద్యమ వ్యూహాలు రూపొందించడంతో అన్ని రాజకీయ పార్టీలు వెంటనే అప్రమత్తమయ్యాయి. దీంతో ఉద్యమ నాయకుడిని తమ పార్టీల్లో చేర్చుకునే గాలం వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కృష్ణయ్యతో భేటీ అయిన అధికార పార్టీకి చెందిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి ఆయన్ను కాంగ్రెస్‌లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఇటు బీజేపీ సైతం కృష్ణయ్యను తమ పార్టీలో చేర్చుకుని రాజ్యసభ సీటు ఇస్తామనే ప్రస్తావన ముందు ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కృష్ణయ్య మాత్రం పార్టీలకతీతంగా బీసీలతో రాజ్యాధికారం సాధించాలనే సంకల్పంతో ముందుకువెళ్తున్నారు.
అధికార పార్టీలో హల్ చల్..!
రాజ్యాధికారం కోసం ఉవ్విళ్లూరుతోన్న బీసీ నేతలు మరో ఉద్యమానికి సిద్ధమవుతుండడం అధికార పార్టీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే బీసీ ఉద్యమాన్ని ముందే పసిగట్టిన అధికార పార్టీ రాష్ట్ర బీసీ కమిషన్‌ను ప్రకటించి వారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో పార్టీలో కీలకమైన పీసీసీ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ కు కేటాయించి వారితో మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయినా అసెంబ్లీ ఎన్నికల కామారెడ్డిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ క్షేత్రస్ధాయిలో ప్రజలతో పాటు సొంత పార్టీ నుంచీ ఒత్తిడి పెరగడంతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి.. బీసీ సీఎం కులగణన చేపట్టిన తర్వాతే స్ధానిక సంస్థలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
ఈ కులగణనలో బీసీ జనాభా లెక్క తేలిన తర్వాత దానికి తగ్గట్టు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి టిక్కెట్లు ఇస్తామని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిన తర్వాత.. అదీ స్ధానిక సంస్థల ఎన్నికల ముందు చేసిన ప్రకటనను నమ్మని అదే పార్టీకి చెందిన బీసీ నేతలు పార్టీలకతీతంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఇటీవల వరంగల్,ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న తనకు ఆ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
సొంతపార్టీపైనే తిరుగుబావుటా ఎగురవేసిన ‘తీన్మార్’తీరుపై హస్తంనేతల్లో అంతర్గత చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఈ నెల 22న హైదరాబాద్‌లోని లకిడికపూల్‌లో హోటల్ అశోక్‌లో జరిగిన బీసీ కులాల రాష్ట్ర సదస్సులో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డేనని..2028లో బీసీ నేత ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెగేసి చెప్పారు. అదే సమయంలో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు పార్టీలో ఉన్న బీసీ నేతలందరూ ఆయనకు తెరచాటు మద్దతు తెలపడం విశేషం. ప్రస్తుతం అధికార పార్టీ రెడ్డి సామాజిక వర్గ నేతలకు కేరాఫ్‌గా మారిందనీ, ఆ నేతలు చెప్పిందే వేదంగా మారుతుందనీ, ఏఐసీసీ కూడా నేతల వైపే మొగ్గుచూపుతుందనే భావన ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలను ఉద్దేశించి ఉద్యమిస్తున్నది.
కాషాయం బీసీ నినాదం..!
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీనే సీఎం ప్రకటించారు. అందుకు అనుగుణంగా అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లను అత్యధికంగా వారికే కేటాయించింది. ఈటల రాజేందర్ వంటి నాయకులకు చేరికల కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్ వంటి కీలకమైన పదవులను కేటాయించారు.పైగా ఇప్పుడు ఎన్నికైన శాసన, పార్లమెంట్ సభ్యుల్లో బీసీలే ఎక్కువ శాతం ఉన్నారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ వంటి నేతలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. భువన నుంచి బూరయ్య గౌడ్‌కు పోటీ చేసే నర్సగిరి కల్పించారు. 17 ఎంపీ స్థానాల్లో నాలుగు స్థానాల్లో బీసీలకు, ఐదు స్థానాలు రెడ్డి, వెలమలకు రెండు, ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు రెండు స్థానాల్లో టికెట్లు కేటాయించారు. రిజర్వేషన్లు మినహా బీసీలకు కిషన్ రెడ్డి నిషేధాన్ని కాషాయ పార్టీ దాదాపుగా యాబై శాతం టికెట్లు కేటాయించి వారికి పెద్ద పీట వేసింది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రీతిన టికెట్ల కేటాయింపు సాగింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లతో కూడిన కమిటీ గతంతో పోల్చితే భారీ స్థాయిలో బీసీలకు ముఖ్యంగా మహిళా, యువత టికెట్లు కట్టబెట్టింది.
భవిష్యత్ కార్యాచరణ, సామాజిక సమీకరణల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు సాగింది. మరోవైపు రాష్ట్ర ప్రజల అభిమతం మేరకు బీసీలకు పెద్దపీట వేయాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా బీసీ నేతలైన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, లేదా రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.మరోవైపు గతంలోనూ బండి సంజయ్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అంశం, తెలంగాణ నుంచి. గుర్తు చేస్తున్నది. వీరితో పాటు సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయకు పలుమార్లు అవకాశం కల్పించడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత హరియాణాకు గవర్నర్ గా ఉన్న బీజేపీ బాధ్యతలను అప్పగించారు. ఈ పరిణామాలను గమనిస్తే బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తున్న విషయం అవగతమవుతోంది. మరోవైపు..
బీసీ సంఘాలకు బీఆర్ఎస్ దగ్గర..!
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం బీసీలకు దగ్గరయ్యేందుకు మార్గాలు అన్వేషిస్తున్నది. ఈ మేరకు ఎన్నికల ముందు బీసీ హామీ అమలయ్యే వరకు పోరాడుతామని స్పష్టం చేసింది. అసలు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల పార్టీ, వివిధ సంఘాలకు చెందిన బీసీ నేతలతో సమావేశమైన కేటీఆర్..రాబోయే చట్టసభలు, స్ధానిక సంస్థల్లో బీసీ నేతలకు మెరుగైన అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు అండగా బీఆర్‌ఎస్ తీసుకున్న చర్యలు, ఆ వర్గంలో విస్తృత ప్రచారం చేసినఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, జోగు రామన్న, నేతలు రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, గౌరీశంకర్, అంజనేయగౌడ్, ఉపేంద్రాచారిగౌడ్, ఉపేంద్రాచారిగౌడ్ పల్లె రవికుమార్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, చిరుమల్ల రాకేశ్‌కు దిశానిర్దేశం చేశారు.