30
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివాళులర్పించారు. గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ గారు బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని స్మరించుకున్నారు. మహిళా లోకానికి స్పూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మగారి పేరును కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన గుర్తుచేసుకున్నారు. ఆ యోధురాలి వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.