సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ మృతి చెందారు. అపార్ట్‌పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించబడింది, అక్కడ చికిత్స పొందుతూ ఆదినారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయన పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆదినారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి పనిచేశారన్నారు. నిజాయతీపరు జర్నలిస్ట్‌గా సమాజంలో మార్పునకు ఎల్లప్పుడూ కృషి చేసారు కొనియాడారు. ఆదినారాయణ కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదినారాయణ అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదినారాయణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.