తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాగా వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను అనర్హులైన రేషన్ కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టింది, ఇందులో భాగంగా బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి. ఈ-కేవైసీ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగింది, ఈ ఏడాది మార్చిలో ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులు హాజరు కాలేదు.
ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా 3.83 కోట్లు ఉండగా.. 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. అక్టోబర్ నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరణ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా గత పదేళ్లుగా ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదు.
గతం లో అర్హతలను పూర్తి గా విచారించకుండానే రేషన్ కార్డులను ప్రభుత్వాలు జారీ చేశాయి. దీని వల్ల అనర్హులకు కూడా తెల్ల రేషన్ కార్డులు వచ్చాయి. వ్యక్తులు లేకున్నా వారి పేరు పై రేషన్ కార్డులున్నాయనే ఆరోపణలు కూడా త ర చూ వస్తూనే ఉన్నాయి. ఈ అనర్హులను గుర్తించేందుకు అక్టోబర్ నెలలో ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు దాదాపు ఆరు సార్లు సమయం పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మార్చి ఏడాదిలో ఈ ప్రక్రియ ముగిసింది. కాగా ఆరు నెలల సమయం ఇచ్చిన దాదాపు 15 లక్షల మంది ఈ–కేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ–కేవైసీ చేసుకొని అందరిని రేషన్ కార్డు జాబితా నుంచి తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాటన్నిటి రద్దు కోసం ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లు.