Home తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరుతాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

సాగునీటి ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరుతాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
సాగునీటి ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరుతాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర ప్రతినిధి, వనపర్తి : తెలంగాణ రాష్ట్రం లోని సాగునీటి ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధు సుధన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి, నీటి పారుదల శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి వనపర్తి జిల్లా కొత్త కోట మండలం కానాయపల్లి గ్రామంలో శంకర సముద్రం రిజర్వాయర్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల, ఆగస్టు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలమూరు జిల్లా ఉమ్మడిగా ఉన్న, పెండింగ్‌లో ఉన్న పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ, జవహర్ నెట్టంపాడు, కోయల్ సాగర్, గట్టు వంటి నూతన సాగునీటి ప్రాజెక్టులు లను నూటికి నూరు శాతం పూర్తి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజీవ్ భీమా సాగునీ టి ఎత్తిపోతల పథకంలోని శంకర సముద్రంలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,ఇరిగేషన్ శాఖ అధికారులు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సాగునీటి కాలువల నిర్మాణానికి ఎంత వ్యయప్రయాసలకోర్చి, ఎంత ఆయకట్టుకు నీరు అందించడం మన్నా పూర్తి నివేదికలను సమర్పించాలని మంత్రి కోరారు.

నివేదికలు అందిన వెనువెంటనే నిధులను అందించి సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు మధు సుధన్ రెడ్డి,వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి,ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్ సి (జనరల్)అనీల్ కుమార్ , ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ కేశవ్ రావు,మధుసూదన్ రెడ్డి, ఈ ఎల్ల స్వామి, డీ.ఈ అఖిల్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు కొనసాగుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech