31
పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నగదు బహుమతిని అందించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అంతేకాదు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10 లక్షలు ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని దీప్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేన, క్రీడా శాఖ అధికారులు ఉన్నారు. ఇక చెప్పిన రెండు వారాల్లోనే ముఖ్యమంత్రి చెక్ అందించడంపై దీప్తి, కోచ్ సంతోషం వ్యక్తం చేశారు.