- తెలంగాణలో బీసీ ఉద్యమం శక్తి కోసమేనట
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ మంగళవారం నాడు నోటిపై చేసింది. బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్. కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ ఆర్ సీపీ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్ళు ఉండగానే ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు.
తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని మెరుగుపరిచేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఏపీకి సంబంధించి మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. అయితే ఇటీవల రాజ్యసభలకు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేశారు. తాజాగా ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య ఎనిమిదికి పడిపోయింది.