Home ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నామినేటెడ్ పోస్టులపై చర్చ తెర దింపారు. రాష్ట్రంలోని 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఉన్నారు.

కూటమిలో టీడీపీ నుంచి 16 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి. ఇటీవల ఇదే అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే కూటమి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా, జనసేన మాత్రం తమకు ఐదు నుంచి ఏడు పదవులు, తమకు పదమూడు పదవులు కావాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా జనసేనకు మూడు, బీజేపీకి ఒక పదవి దక్కింది.

20 కార్పొరేష‌న్ల‌ చైర్మ‌న్లు వీరే..

  • ఏపీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ – కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌
  • వ’క్ఫ్ బోర్డు – అబ్దుల్ అజిజ్
  • శాప్ – రవి నాయుడు
  • హౌసింగ్ బోర్డు – బత్తుల తాతయ్య బాబు
  • 20 సూత్రాల అమ‌లు క‌మిటీ – లంక దిన‌క‌ర్ (బీజేపీ)
  • ఏపీ ట్రైకార్ – బోగారం శ్రీనివాసులు
  • ఏపీ మారిటైమ్ బోర్డు – దామచెర్ల సత్య
  • ఎస్ఈడీఏపీ – దీపక్ రెడ్డి
  • విత్తనాభివృద్ధి సంస్థ – మన్నె సుబ్బారెడ్డి
  • ఏపీఐఐసీ – మంతెన రామరాజు
  • మార్క్ ఫెడ్ – కర్రోత్తు బంగ‌ర్రాజు
  • ఏపీ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – నూక‌సాని బాలాజీ
  • ప‌ద్మ‌శాలి వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – నందం అబ‌ద్ద‌య్య‌
  • ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
  • లెద‌ర్ ఇండ‌స్ట్రీస్ దేవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – పిల్లి మాణిక్యాల రావు
  • ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీత’ల సుజాత
  • ఏపీ స్టేట్ సివిల్ స‌ప్ల‌య్స్ కార్పొరేష‌న్ – తోట మెహ‌ర్ సీతారామ సుధీర్(జ‌న‌సేన)
  • ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ – త‌మ్మిరెడ్డి శివ‌శంక‌ర్(జ‌న‌సేన)
  • ఏపీఐడీసీవో – వేణుములపాటి అజయ్ కుమార్ (జ’నసేన)
  • ఏపీటీపీసీ – వజ్జ బాబు రావు
  • ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech