తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రంపై టీటీడీ శాంతి హోమం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతి యాగం చేపట్టిన టీటీడీ, మూడు హోమ గుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టారు. హోమంలో ఎనిమిది మంది ఆలయ అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు ఉన్నారు. ఉదయం 5.40 కు శాతుమోరు, మొదటి గంట తర్వాత రెండో గంటలోపు శాంతి హోమం ముగిసింది. వాస్తు హోమం, పాత్రశుద్ది, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు.
టీటీడీ ఈవో శ్యామలరావు శాంతిహోమంలో పాల్గొని సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో కొనసాగుతారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్యాలతో సంప్రదింపులు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు, జీయర్ స్వాముల పర్యవేక్షణలో శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారిపోటులో ప్రోక్షణ నిర్వహించారు.
నెయ్యి వాడకం అన్ని చోట్ల ప్రోక్షణ జరిగింది. ప్రోక్షణతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపి వేశారు. ప్రత్యేక గంట తర్వాత పోటు సిబ్బంది శ్రీవారికి అన్నప్రసాదాలు తయారీ. శాంతిహోమం తర్వాత ఆవాహన చేసి ఆ దినుసులను స్వామి వారి దగ్గర పెట్టి అనంతరం కుంభ ప్రోక్షణ అర్చకులు నిర్వహించారు.